CBSE 10th Result 2021 Declared: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి, ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్‌ఈ బోర్డు
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
New Delhi, August 3: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు (CBSE 10th Result 2021 Declared) మంగళవారం వెల్లడయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇంటర్నల్స్, యూనిట్ టెస్ట్స్, మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు. పరీక్షలు నిర్వహించకుండా సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఈ ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉంది. అయితే.. స్కూళ్లు మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది.
కరోనావైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేయగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
CBSE 10th Result 2021: ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి
Step 1: Visit the official website cbseresults.nic.in
Step 2: Click on the result link available on the homepage
Step 3: Log-in using credentials
Step 4: Result will appear, take a print out of the scorecard for further reference
కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించలేనందున, 10 వ తరగతి విద్యార్థులకు CBSE ఫలితాలు ప్రత్యామ్నాయ మూల్యాంకనం ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఈ ప్రత్యామ్నాయ మూల్యాంకన ప్రణాళిక ప్రకారం, 20 మార్కులు పాఠశాలల ద్వారా నిర్వహించిన అంతర్గత అంచనాలపై ఆధారపడి ఉంటాయి, 10 మార్కులు ఆవర్తన/యూనిట్ పరీక్షలకు కేటాయించబడతాయి, 30 మార్కులు అర్ధ సంవత్సరం పరీక్షలకు కేటాయించబడతాయి. 40 మార్కులు ప్రీ-బోర్డు పరీక్ష స్కోర్లుకు కేటాయించబడతాయి.