 
                                                                 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్ (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్) పరీక్ష సెప్టెంబర్19న (AP ECET 2021 Exam Date) నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది. అలాగే వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం కల్పించింది. ఏపీ ఈసెట్‌ను (AP ECET 2021 Date Released) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్‌టీయూ నిర్వహించనుంది.
ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని వీసీ రంగజనార్ధన్ తెలిపారు. ఇక పదో తరగతి పరీక్షల ఫలితాలకు మరో వారం సమయం పట్టనుంది. అంతర్గత పరీక్షల మార్కుల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది.
మార్కుల సేకరణ అనంతరం పాఠశాల విద్యాశాఖ..ప్రభుత్వ పరీక్షల విభాగానికి జాబితాను అందించాల్సి ఉంటుంది. అనంతరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
