AP Inter Admissions 2021: ఏపీలో ఆన్‌లైన్‌లోనే ఇంటర్ అడ్మిషన్లు, అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపిన ఇంటర్‌ బోర్డు, విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాలని విజ్ఞప్తి
Representational Image (Photo Credits: PTI)

Amarvati, July 26: ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు (AP Inter Admission 2021) ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు (AP Inter Board) పరిగణించదని స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాలని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది.

సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్‌ బదిలీ అయ్యారు. మైనార్టీ వెల్ఫేర్‌ స్పెషల్ సెక్రటరీగా గంథం చంద్రుడు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రాజబాబు, శ్రీకాకుళం జేసీగా సుమిత్ కుమార్‌, పశ్చిమగోదావరి జేసీగా అంబేద్కర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆప్కాబ్‌).. ఐబీపీఎస్‌ ద్వారా మేనేజర్, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 61. పోస్టుల వివరాలు: మేనేజర్‌(స్కేల్‌1)–26, స్టాఫ్‌ అసిస్టెంట్లు–35.

ఏపీలో నూతన విద్యా విధానం, కొత్తగా 6 రకాల స్కూల్స్‌, ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖకు అదేశాలు జారీ చేసిన సీఎం జగన్, రూ.16 వేల కోట్లతో చేపట్టిన నాడు – నేడు విజయవంతం కావాలని సూచన

► మేనేజర్‌(స్కేల్‌1): స్పెషలైజేషన్లు: అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్‌. అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

► స్టాఫ్‌ అసిస్టెంట్లు: అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021

► ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేది: 2021 సెప్టెంబర్‌ మొదటి వారం

► వెబ్‌సైట్‌: https://www.apcob.org