TS Dussehra Holidays: 12 రోజుల పాటు దసరా సెలవులు, ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించిన తెలంగాణ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపనున్న టీఎస్‌ఆర్టీసీ

ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు.

Representational Image | File Photo

Hyd, Oct 5: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు (TS Dussehra Holidays) ఇవ్వనున్నారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్‌ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వనున్నారు.

13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు (dussehra holidays from October 6 in telangana) ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. పాఠశాలలు ఈ నెల 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధన మొదలుకాగా సెలవుల ప్రారంభం(6వ తేదీ) నాటికి 25 రోజులు మాత్రమే తరగతులు జరిగాయి.

ఇక దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈ దసరాకు 4,045 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. వాటిలో 3,085 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, 950 బస్సులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి నడుపుతామని వివరించారు.

తెలంగాణలో కొత్తగా 207 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు

హైదరాబాద్‌లో ప్రధాన బస్ స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, దిల్‌సుఖ్‌గర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, అరాంఘర్ క్రాస్ రోడ్‌ల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు వరప్రసాద్ తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులపై ఒకటిన్నర శాతం ఛార్జీలు అధికంగా వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా నడిపించే ఈ ప్రత్యేక బస్సులతో టీఎస్‌ ఆర్టీసీకి రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ వెళ్లే బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నడిపించనున్నట్లు చెప్పారు. అలాగే ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి వరంగల్, పరకాల, మహబూబాబాద్, భువనగిరి, యాదగిరి గుట్టకు వెళ్లే బస్సులుంటాయన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు బస్సులు ఉంటాయని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాలైన కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపూర్, ఒంగోలు, నెల్లూర్‌కు ఓల్డ్ సీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులుంటాయి. మిగితా బస్సులను ఎంజీబీఎస్ నుంచి నడిపించనున్నట్లు చెప్పారు.



సంబంధిత వార్తలు

China Response on HPMV Virus Outbreak: అదేం పెద్ద ప్రమాదం కాదు, వైరస్‌ విజృంభణపై చాలా లైట్‌ తీసుకున్న చైనా, ప్రయాణికులు భయపడొద్దని ప్రకటన

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)