MILKYWAY Tablet With BharatGPT: భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధ ఆధారిత ఎడ్యుకేషనల్ టాబ్లెట్ విడుదల, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరికరంలో ప్రత్యేకతలు ఎన్నో, దీని ఫీచర్లు.. ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

BharatGPT powered Tablet | Pic: X

MILKYWAY Tablet With BharatGPT:  ఎపిక్ ఫౌండేషన్ అనే సంస్థ 'మిల్క్‌వే' పేరుతో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ తయారీ ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇది పూర్తిగా మేడ్- ఇన్- ఇండియా టాబ్లెట్, దీనిని MediaTek మరియు CoRover.ai సహకారంతో VVDN టెక్నాలజీస్ రూపొందించింది.

ఈ MILKYWAY టాబ్లెట్ చాలా ప్రత్యేకమైనది, ఇది ChatGPTకి దేశీయ అవతారంగా చెప్పే BharatGPT ద్వారా ఆధారితమైనది. అనేక AI-సెంట్రిక్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్‌ను సులభంగా రిపేర్ చేయవచ్చు, అప్‌గ్రేడ్ చేయవచ్చు.

అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఇంటిగ్రేషన్ కలిగి ఆపరేటింగ్ చాలా సులభతరంగా ఉంటుంది.

దేశీయంగా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ టాబ్లెట్‌ను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యను మరింత చేరువచేసేలా, రాష్ట్ర ప్రభుత్వాల కోసం మూడు లక్షల టాబ్లెట్‌లను తయారు చేయాలన్నది కంపెనీ లక్ష్యం.

ఈ టాబ్లెట్ విద్యార్థులకు చాలా రకాలుగా సహాయపడుతుంది.  BharatGPT వర్చువల్ అసిస్టెంట్‌ ద్వారా వాయిస్ అసిస్టెంట్, వీడియో చాట్ అసిస్టెంట్ కలిగి ఉంటుంది. డిజిటల్ లర్నింగ్ మరింత సులభతరం చేస్తూ.. ఉపన్యాసకులు ఏ భాషలో మాట్లాడినా, వారి మాతృభాషకు అనువాదం చేస్తుంది. ఇందులో రియల్ టైమ్ స్పీచ్ ట్రాన్స్‌లేషన్ యాప్‌ ఉంటుంది. ఇక, హార్డ్‌వేర్ పరంగా, మిల్క్‌వే ట్యాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లను కలిగి ఉందో ఈ కింద పరిశీలించండి.

MILKYWAY Tablet ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కనెక్టివిటీ కోసం, బ్లూటూత్ 5.0, Wi-Fi ,  4G LTE , BharatGPT పవర్డ్ AI మొదలైనవి ఉన్నాయి.

ఈ టాబ్లెట్ మార్కెట్ విడుదల తేదీ ఇంకా ప్రకటించనందున ధరలను ఇంకా నిర్ణయించలేదు, త్వరలో ఆ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.