Board Exams Twice in a Year: పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు.. మెరుగైన స్కోరును ఎంపిక చేసుకునే అవకాశం.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు
బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. ఛత్తీస్ గఢ్ లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మేరకు వెల్లడించారు.
Newdelhi, Feb 20: పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు (Students) కేంద్రం శుభవార్త చెప్పింది. బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. ఛత్తీస్ గఢ్ లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఈ మేరకు వెల్లడించారు. ఈ అవకాశాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కల్పించనున్నట్లు తెలిపారు.
మెరుగైన స్కోరునే..
రెండుసార్లు పరీక్షలు రాసి, మెరుగైన స్కోరునే ఉంచుకుని, మిగిలిన దానిని రద్దు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.
NITI Aayog Tax Reforms: వృద్ధులకు తప్పనిసరి సేవింగ్స్ ప్లాన్.. ప్రభుత్వ మేధోసంస్థ నీతి ఆయోగ్ సూచన