TS Inter Result 2022: రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు, దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు నిరీక్షణ
రాష్ట్రంలో మే ఆరో తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు
ఇంటర్మీడియట్ ఫలితాలు సోమ, మంగళవారాల్లో విడుదల కానున్నట్లు (TS Inter Result 2022) సమాచారం. రాష్ట్రంలో మే ఆరో తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పటికే పరీక్షల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాగా.. రెండు మూడు రోజుల్లో ఫలితాలు (Telangana Inter Results) విడుదల కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటర్ రిజల్ట్స్ ను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వీరికి సంబంధించిన ఫలితాలను విడుదల అయిన తర్వాత త్వరలోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. గతంలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో చాలా తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదైన విషయం తెలిసిందే. గతంలో ఫెయిలయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది ప్రభుత్వం. అయితే.. ఈ సారి అలా పాస్ చేసే ప్రసక్తే ఉండదని ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ అనేక మార్లు స్పష్టం చేసింది. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో ఈ సారి నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది తెలంగాణ పదోతరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సారి ఆరుపేపర్లతో పరీక్ష నిర్వహించారు. పరీక్షలు ఎటువంటి సమస్యల లేకుండా పూర్తయ్యాయి. విద్యాశాఖ పరీక్ష పేపర్లకు సంబంధించి ఇప్పటికే దిద్దడం పూర్తి చేసింది. తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈనెల 20న లేదా 25న రావొచ్చు. ఈ తేదీలను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం సిలబస్‌ను 70 శాతానికి కుదించి ఇచ్చారు. అంతే కాకుండా పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించారు