TS Inter Exams: తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, హాల్ టికెట్ www.tsbie.cgg.gov.in నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
సెకండ్ ఇయర్ కు మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు(Inter exams) ప్రారంభం కానున్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనుండగా... సెకండ్ ఇయర్ కు మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ www.tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం హాల్ టికెట్ కోసం పదో తరగతి హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కోసం ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు.
కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ వెసులుబాటును కల్పించింది. ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్‌బోర్డు గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించింది.