Vijayawada, March 11: ఏపీలో (AP) వచ్చే నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల (SSC Exams) నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ (Suresh kumar) విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్ (Mobile Phone), ల్యాప్‌టాప్ (Laptop), ట్యాబ్ (Tab), కెమెరా (Camera), ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్ ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు. ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ తదితర పరీక్షల పేపరు లీకేజీపై వదంతులు నమ్మొద్దని, అలాంటి ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే విద్యార్థులను తర్వాతి పరీక్షలకు అనుమతించబోమన్నారు. పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్ కోసం విద్యార్థులు తప్పనిసరిగా www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ చూస్తుండాలని సూచించారు.
కమిషనర్ సూచనలు ఇవి..
- పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయి.
- విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు వారిని పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.
- నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరు.
- ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ పరీక్షలకు 12 పేజీలతో సమాధాన పత్రాలు వేర్వేరుగా ఉంటాయి.
- పరీక్ష ముందుగానే రాసేసినా సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలులోనే ఉండాలి.
- విద్యార్థులు తమ రోల్ నంబరు, పేరు లాంటి వ్యక్తిగత వివరాలను సమాధాన పత్రంలో రాయకూడదు.
- ఓఎంఆర్ షీటులోనే రాయాలి. విద్యార్థులు పెన్, పెన్సిల్, స్టేషనరీని వెంట తెచ్చుకోవచ్చు.
మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు, ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు