TS EAMCET 2022 Results: టీఎస్ ఎంసెట్ ఫలితాలు రేపు విడుదల, ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో eamcet.tsche.ac.in ద్వారా విడుదల చేయనున్న మంత్రి సబిత
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను (TS EAMCET 2022 Results) విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను (TS EAMCET 2022 Results) విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఉదయం 11:45 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎంసెట్ ఫలితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.ఎంసెట్ (TS EAMCET) ఇంజినీరింగ్ ప్రవేశ పరక్షీలను జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడుతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
మళ్లీ ఇంకో ముప్పు..ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు
అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు జులై 30, 31 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించాల్సినప్పటికీ, వివిధ కారణాల రీత్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు తమ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.