TS EAMCET 2023 Results Out: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను eamcet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

Representational Picture. Credits: PTI

TS EAMCET Results 2023 Manabadi Declared: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసిన సంగతి విదితమే. జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. తాజాగా ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎం సెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలంగాణతో పాటు ఏపీ నుంచి దాదాపు 2లక్షల మంది, అగ్రికల్చర్‌ పరీక్షకు దాదాపు లక్ష మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజినీరింగ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌కు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.