TS EAMCET 2020 Results Declared: తెలంగాణ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల, ఎంసెట్‌లో 75.29శాతం విద్యార్థులు ఉత్తీర్ణత, అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్, కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లో 3.30 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఎంసెట్ 2020 ఫలితాలు (TS EAMCET Results 2020) విడుద‌ల చేశారు.

AP 10th Class Exams Cancelled. Representational Image. |(Photo Credits: PTI)

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2020 ఫలితాలు (TS EAMCET 2020 Results) విడుదలయ్యాయి. హైదరాబాద్, కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లో 3.30 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఎంసెట్ 2020 ఫలితాలు (TS EAMCET Results 2020) విడుద‌ల చేశారు. ఎంసెట్‌లో 75.29శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89,734 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌కు అర్హత సాధించారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌కు 1,43,326 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 9 నుంచి 17 వరకు ఇంజనీరింగ్ సీట్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబరు 12 నుంచి 18 వరకు జరగనుంది. అభ్యర్థులు అక్టోబరు 12 నుంచి 20 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అక్టోబరు 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్ల జరుగుతుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి 

TS EAMCET ఫలితం 2020 ను ఎలా తనిఖీ చేయాలి

అధికారిక వెబ్‌సైట్ నుండి TS EAMCET 2020 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి:

Eamcet.tsche.ac.in కు వెళ్లండి

‘TS EAMCET ఫలితం’ లింక్‌పై క్లిక్ చేయండి

మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మరియు అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి

ఫలితాన్ని సమర్పించండి మరియు డౌన్‌లోడ్ చేయండి.

TS EAMCET 2020 కౌన్సెలింగ్ కోసం వివరణాత్మక షెడ్యూల్ను అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, ధృవీకరణ కోసం పిలిచినప్పుడు, అభ్యర్థులు నింపిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif