TS EAPCET 2024 Schedule Released: విద్యార్థులకు అలర్ట్, తెలంగాణ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో ఈఏపీసెట్ (TS EAPCET 2024) షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
మే 9 నుంచి 12 వరకు తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు.గతంలో టీఎస్ ఎంసెట్‌గా పేర్కొనే ఈ పరీక్షకు టీఎస్ ఈఏపీసెట్‌గా ఇటీవలే మార్పు చేయగా.. జేఎన్‌టీయూ-హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది.
ఇక టీఎస్ ఎంసెట్‌ను ఈఏపీసెట్ (TS EAPCET)గా తెలంగాణ ఉన్నత విద్యా మండలి మార్పు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (TS EAPCET) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు
మే 6న ఈసెట్
మే 9 నుంచి 13 వరకు ఎంసెట్
మే 23న ఎడ్‌సెట్
జూన్ 3న లాసెట్
జూన్ 4,5 తేదీల్లో ఐసెట్