TS ECET Result 2024 Out: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి లింక్ ఇదిగో..

పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.

Results

తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ర్యాంకుల్ని బట్టి పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది. తెలంగాణలో నేటి నుంచి టెట్ పరీక్షలు... జూన్ 2 వరకు ఎగ్జామ్స్.. రోజుకు రెండు సెషన్ల చొప్పున టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో టెట్ పరీక్షలు.. ఈ ఏడాది టెట్ కు 2.86 లక్షల మంది దరఖాస్తు

ఇక తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం (మే 20) నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ వెల్లడించారు.

టెట్ కు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.