Hyderabad, May 20: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TET) నేటి నుంచి ప్రారంభం కానున్నది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు.
ఇయ్యాల్టి నుంచి టెట్ ఎగ్జామ్స్ https://t.co/GeieXEXyJK
— V6 News (@V6News) May 20, 2024
ఏ పేపర్ కి ఎంతమంది దరఖాస్తు?
టెట్ కు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి.