Global Hunger Index 2023: దేశంలో ఆకలి కేకలంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక.. 125 దేశాల్లో భారత్‌కు 111వ స్థానం.. భారత్ ఫైర్!

భారత్‌లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పేరిట విడుదలైన నివేదికను భారత్ ఖండించింది.

Global Hunger Index (Credits: X)

Newdelhi, Oct 13: భారత్‌లో (Bharat) అనేక మంది ఆకలితో (Hungry) అలమటిస్తున్నారంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (Global Hunger Index 2023) పేరిట విడుదలైన నివేదికను భారత్ ఖండించింది. ఇలాంటివి దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని మండిపడింది. ఈ సూచి వాస్తవాన్ని ప్రతిఫలించట్లేదని వ్యాఖ్యానించింది. గురువారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2023ను విడుదల చేశారు. మొత్తం 125 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్‌ చివరన 111వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మన దేశంలో 28.7గా ఉన్న ఆకలి సూచి.. ప్రజలు తిండిలేక అలమటిస్తున్నారన్న విషయాన్ని సూచిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులు చూసి భారత్ ఆ పాఠాలు నేర్చుకోవాలి, కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్‌ఎస్‌జీ చీఫ్ ఎంఏ గణపతి

భారత్ కంటే మెరుగైన స్థితిలో..

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ లో దాయాదిదేశం పాక్‌ 102 స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 81వ స్థానం, నేపాల్ 69వ స్థానం, శ్రీలంక 60వ స్థానంలో.. భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది.

ఇజ్రాయెల్‌కు ప్రధాని మోదీ సపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటు, హమాస్ దాడి ఇజ్రాయెల్ దురాగతాలకు సహజ ప్రతిచర్యని తెలిపిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు