George Floyd Death: జార్జ్ ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్, గగనతలంపై రెపరెపలాడుతున్న జార్జ్ ఫ్లాయిడ్ ఐ కాంట్ బ్రీత్ నినాదం, శాంతియుతంగా నిరసన తెలపాలని కోరిన ట్రంప్
ఈ రిపోర్టుల ప్రకారం ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ కు కరోనా (Coronaivrus) వచ్చినట్లు అటాప్సి రిపోర్టులో తేలింది. ఏప్రిల్ 3న పాజిటివ్ తేలినా లక్షణాలు మాత్రం కన్పించలేవు. ఐతే ఊపరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో పాటు గుండె ధమనులు మూసుకుపోయినట్లు తెలిపారు.
Minneapolis, June 4: అమెరికా పోలీసుల చేతిలో నరహత్యకు గురైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ (George Floyd Death) పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల చేశారు. ఈ రిపోర్టుల ప్రకారం ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ కు కరోనా (Coronaivrus) వచ్చినట్లు అటాప్సి రిపోర్టులో తేలింది. ఏప్రిల్ 3న పాజిటివ్ తేలినా లక్షణాలు మాత్రం కన్పించలేవు. ఐతే ఊపరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో పాటు గుండె ధమనులు మూసుకుపోయినట్లు తెలిపారు. అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం, క్షమాపణలు కోరిన అమెరికా, ఆర్మీని రంగంలోకి దింపుతామని తెలిపిన ట్రంప్
మొత్తం 20 పేజీల అటాప్సీ రిపోర్టును హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కుటుంబం అనుమతితో విడుదల చేశారు. ఐతే పోలీసులు అతన్నిఅదుపులోకి తీసుకున్న సమయంలోనే గుండెపోటు వచ్చిందని...ఆ కారణంతోనే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ (Chief Medical Examiner Andrew Baker) మాట్లాడుతూ.. ‘మెడపై తీవ్రమైన ఒత్తిడి వల్లే ఫ్లాయిడ్ మరణించాడు.జార్జ్ ఫ్లాయిడ్‌ది నరహత్యే, పోస్టుమార్టం నివేదికలో బహిర్గతం, నిరసనలపై మండిపడిన డొనాల్డ్ ట్రంప్, హత్యను ఖండించిన టెక్ దిగ్గజాలు
అతడు మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక ఏప్రిల్ 3న ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు, కాని లక్షణ రహితంగా ఉన్నాడని వెల్లడించారు. మరణించిన సమయంలో ఫ్లాయిడ్ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా కనిపించాయని తెలిపారు.
Here's Video
గతంలో అమెరికా పోలీసులు (US Police) ఇచ్చిన నివేదికలో ఫ్లాయిడ్ ‘ఫెంటనిల్ ఇన్‌టాక్సికేషన్’, ‘మెథమ్‌ఫెటమైన్’ అనే డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫెంటనిల్ ఇన్‌టాక్సికేషన్ వల్ల తీవ్రమైన శ్వాసకోశ మాంద్యం, మూర్ఛ లక్షణాలు ఉంటాయని.. కానీ ఫ్లాయిడ్‌లో ఇవేవి కనిపించలేదని నివేదికలో తెలిపారు. ఊపిరాడకపోవడం వల్లే ఫ్లాయిడ్ మరణించాడని ఆండ్రూ బేకర్ తెలిపారు.
జార్జ్ ఫ్లాయిడ్ మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. దీంతో అమెరికా నల్లజాతి నిరసనలతో అట్టుడుకుతోంది. మే 25న శ్వేతజాతి పోలీసుల చేతిలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు చనిపోవడంతో అగ్రరాజ్యంలో నిరసన సెగలు మిన్నంటాయి. నల్లజాతీయులు ఏకంగా తమ ఆందోళనలతో శ్వేతసౌధాన్ని కూడా ముట్టడించారు. చివరకు అమెరికా అధ్యక్షుడు సైతం బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే.
Here's Video
జార్జి ఫ్లాయిడ్ చివరి మాటలు అమెరికన్ గగనతలంలో బ్యానర్లపై రెపరెపలాడుతున్నాయి. తన గొంతుపై ఆ పోలీసు మోకాలిని తొక్కిపెట్టి ఉంచినప్పుడు ఫ్లాయిడ్ ఊపిరాడక.. ప్లీజ్ ఐ కాంట్ బ్రీత్.. మై స్టొమక్ హర్ట్స్.. దె ఆర్ గోయింగ్ టు కిల్ మీ.. మై నెక్ హర్ట్స్.. ప్రాణాలు పోయేముందు కొన్ని నిముషాల పాటు విలవిలాడాడు. ఆ మాటలను జామీ హోమ్స్ అనే ఆర్టిస్టు బ్యానర్‌ల పై రాసి యూఎస్‌లోని ఐదు నగరాలలో (డెట్రాయిట్, మయామి, డాలస్, లాస్ ఏంజలెస్, న్యూయార్క్) ఎగరేశారు.
Here's I can't Breath video
గతంలో పోలీసుల చేతిలో హత్యకు గురైన నల్లజాతీయుల పేర్లను ఆందోళనకారులు నినాదాలుగా మార్చుకుంటున్నారు. మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ పట్టణంలో నిరసనకారులు ‘ఫ్రెడ్డీ గ్రే’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయగా.. కాన్సస్ రాష్ట్రంలోని టొపెకా, కాన్సస్ వంటి నగరాల్లో టీ-షర్టులపై డొమినిక్ వైట్ పేరును ముద్రించుకున్నారు.
Here's fly banner
ఓక్లహామాలో శతాబ్దం కిందట వందల మంది నల్లజాతీయులను సామూహికంగా హత్యచేసిన ప్రాంతంలో సోమవారం వందల మంది గుమిగూడి ‘టెరెన్స్ క్రచర్' పేరును స్మరించారు. ‘వివిధ జాతుల ప్రజలు ఫ్లాయిడ్ ఘటనతో దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో పోలీసుల చేతిలో హత్యకు గురైనవారిని తలుచుకొంటున్నారు. బాధితులందరికీ న్యాయం జరగాలనే డిమాండ్ పెరిగింది’ అని షికాగోకు చెందిన మంత్రి మార్షల్ హ్యాచ్ పేర్కొన్నారు. ఆయన కూడా ఉద్యమంలో పాల్గొని ‘బ్రెట్టీ జోన్స్' అంటూ నినాదాలు చేశారు. బ్రెట్టీజోన్స్ 2015లో పొరుగింటివారితో గొడవపడుతుండగా పోలీసులు అమానుషంగా కాల్చి చంపారు.
నిరసనల నేపథ్యంలో 150కిపైగా నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆరు రాష్ర్టాలు, 13 ప్రధాన నగరాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. దేశవ్యాప్తంగా 67 వేల మంది నేషనల్ గార్డ్‌లను మోహరించారు. ఇప్పటివరకు 4000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కాగా, సోమవారం రాత్రి బఫెలోలో నిరసనల సందర్భంగా ఒక వాహనం పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. డ్రైవర్‌ను, అందులోని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాలని ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీచేయగా, మరోవైపు జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు టెరెన్స్ ఫ్లాయిడ్ శాంతి సందేశం వినిపించారు. హింసాత్మక నిరసనలు ఆపాలని, శాంతియుతంగా పోరాడం సాగించాలని ఆందోళనకారులకు విజ్ఞప్తిచేశారు. పోలీసులు చేతిలో తన సోదరుడు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని సోమవారం ఆయన సందర్శించారు. మోకాలిపై కూర్చొని ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమయ్యారు. అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. హింసాత్మక చర్యలను ఆపాలని, తన సోదరుడిని అవి వెనక్కి తీసుకురాలేవని పేర్కొన్నారు.
నిరసనకారులు దేశ రాజధానిలోని లింకన్ స్మారకం, రెండో ప్రపంచ యుద్ధ స్మారకాన్ని ధ్వంసం చేశారని, చారిత్రక చర్చికి నిప్పుపెట్టారని అమెరికా అధ్యక్షుడు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపేవారికి తన మద్దతు ఉంటుందని పేర్కొంటూ పరిస్థితులను శాంతపరిచే ప్రయత్నం చేశారు.