Washington, June 2: జార్జ్ ఫ్లాయిడ్ (46) మరణంపై అమెరికా (America) నిరసనలతో ఆందోళనకరంగా మారిన సమయంలో కీలకమైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని(Minneapolis) హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. యుఎస్ పోలీసులు అదుపులో ఉండగా అతడు గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే (Death of George Floyd) నిర్ధారణ అయింది. ఓవైపు కరోనా..మరోవైపు ఎబోలా, కాంగోలో ఎబోలా వైరస్ దెబ్బకు నలుగురు మృతి, 11సార్లు కాంగోలో వ్యాధి విజృంభణ, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ
ఫ్లాయిడ్ కుటుంబానికి చెందిన న్యాయవాది బెంజమిన్ క్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు జార్జ్ మెడ మీద కాలువేసి తొక్కుతున్నప్పుడే అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో మరణించాడని పరీక్షల్లో తేలినట్టు క్రంప్ చెప్పారు. పోలీసుల అమానుషంతోనే అతను మరణించాడని, అంబులెన్సే జార్జ్‌కు పాడెగా మారిందని వ్యాఖ్యానించారు.
మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గత సోమవారం జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో తెల్ల జాతి పోలీస్ అధికారి డెరెక్ షావిన్ అతని మెడపై మోకాలితో బలంగా నొక్కుతుండగా ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిరాయుధుడైన ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి పోలీసులే కారణమంటూ ఎగిసిన నిరసనలతో అమెరికా అతలాకుతలమవుతోంది. నిరసనకారులు ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను ముట్టడించారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో ప్రమాదమేమి లేదు, వైద్యుల పర్యవేక్షణలో వాడండి, స్పష్టం చేసిన ఐసీఎంఆర్, ఇదివరకే దీనిపై నిషేధం విధించిన డబ్ల్యూహెచ్‌ఓ
జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా (George Floyd protest) అమెరికాలో ‘ఐ కాంట్ బ్రీత్’ అనే నినాదం మారుమోగుతోంది. ఈ క్రమంలో వేలాదిమంది ఆందోళనకారులు ఆదివారం రాత్రి వైట్‌హౌస్ వద్దకు తరలివచ్చారు. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. భారీగా ఉన్న బందోబస్తును చీల్చుకుంటూ అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంలో ముందస్తు జాగ్రత్తగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సీక్రెట్ ఏజెన్సీ రహస్య బంకర్‌లోకి పంపింది. సుమారు గంటపాటు ట్రంప్ అదే బంకర్‌లో తలదాచుకున్నారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్రయల్స్ ఆపేయండి, ఈ డ్రగ్ తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ట్వీట్లు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ‘‘ఆందోళనకారులపై కుక్కలను ఉసిగొల్పుతాం..లూటీలు ఆపకపోతే తుపాకులు గర్జిస్తాయి’’ (‘వెన్ లూటింగ్ స్టార్ట్స్, షూటింగ్ స్టార్ట్స్’) అంటూ ట్రంప్ ట్వీట్‌తో రెండు రోజులుగా వైట్‌హౌజ్ ముందు ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. నిరసనకారులు వైట్‌హౌస్ ముందు ఉన్న పోలీసు కారును దహనం చేశారు. ఆందోళనకారులను ఆపేందుకు సీక్రెట్ సర్వీస్ పోలీసులు యత్నించారు. విద్యుత్ నిలిపివేయడంతో వైట్‌హౌజ్‌లో రాత్రి కొంతసేపు అంధకారం నెలకొంది. ఆరు రోజులుగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక ఘటనలుగా మారాయి. ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్ చేశారు. నలభై నగరాల్లో కర్ఫ్యూ విధించారు. హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్ 19 మనతో ఉంటుంది, కలిసి జీవించడం నేర్చుకోవాలి, దేశాలన్నీ జాగ్రత్తగా వ్యవహరించాలి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
మినసోటాలో మొదలైన ఆందోళన పర్వం దావానలంలా లాస్ ఏంజిలెస్, షికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలకూ విస్తరించింది. ఈ స్థాయి ఆందోళనలు 1968లో మార్టిన్ లూథర్‌కింగ్ హత్య తరువాత మాత్రమే జరిగాయని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ఒక్క అమెరికాలోనే కాకుండా న్యూజీలాండ్, సెంట్రల్ లండన్, బ్రెజిల్, కెనడా, చైనాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతానికి నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో జరగనున్నాయి. మినియాపోలిస్‌లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
నార్త్ కారొలీనాలో జన్మించిన ఫ్లాయిడ్ హ్యూస్టన్‌లో పెరిగి పెద్దయ్యారు. 2014 నుంచి ఫ్లాయిడ్ మినియాపోలీస్‌లో ఉంటున్నా అతడి ఇద్దరు కూతుళ్లు హ్యూస్టన్‌లో ఉంటున్నారు. ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరెక్ ఛావిన్‌ను ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించగా శుక్రవారం హత్య ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేశారు. ఫ్లాయిడ్ మృతదేహానికి తాము ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తామని ఆ గౌరవం తమకు కలిగించాలని హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ముఖ్యాధికారి ఆర్ట్ అసీవిడో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో బహిరంగంగా అభ్యర్థించారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌వద్ద భారీ స్థాయిలో నిరసన చెలరేగడంతో, హింసాత్మక నిరసనలను అరికట్టడానికి భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.జార్జ్ ఫ్లాయిడ్ మృతితో దేశవ్యాప్తంగా నిరసన పేరుతో నగరంలో చాలా అమర్యాదకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని, అవి శాంతియుత నిరసనలు కావంటూ మండిపడ్డారు. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో అల్లర్లు, దోపిడీలు, దాడులు, ఆస్తి విధ్వంసాలను ఆపడానికి వేలాది మంది సాయుధ సైనికులు, ఇతర పొలీసు అధికారులను పంపిస్తున్నానని ప్రకటించారు.
ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.