'Good And Fruitful Meeting': కలిసే పనిచేస్తాం, హోమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీఎం అయిన తరువాత ఇదే తొలి కలయిక, ఢిల్లీ పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు

సీఎంగా హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్ పదవీప్రమాణం అనంతరం తొలిసారి అమిత్ షా నివాసానికి వెళ్లారు. ఆయనతో ఢిల్లీ పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ భేటీపై కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు.

Delhi CM Arvind Kejriwal meets Home Minister Amit Shah (Photo-HMO Twitter)

New Delhi, Febuary 20: ఇటీవలి ఎన్నికల్లో (Delhi assembly Elections) ఘనవిజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఢిల్లీని గెలిచిన జోష్ లవర్ బాయ్‌గా మారిన అర్వింద్ కేజ్రీవాల్

సీఎంగా హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్ పదవీప్రమాణం అనంతరం తొలిసారి అమిత్ షా నివాసానికి వెళ్లారు. ఆయనతో ఢిల్లీ పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ భేటీపై కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు.

హోం మంత్రి అమిత్ షాతో చాలా ఫలప్రదమైన సమావేశం జరిగిందని అనంతరం కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) ట్వీట్ చేశారు. ఢిల్లీకి సంబంధించిన వివిధ ఇష్యూలపై అమిత్ షాతో (Home Minister Amit Shah) చర్చించినట్లు ఆప్ అధినేత తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు తామిద్దరం అంగీకరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. తమ సమావేశం సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్నారు.

Here's ANI Video

ఇకపై ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఓ అంగీకారానికి వచ్చామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతకుముందు భేటీ ముగిసిన తర్వాత, అమిత్ షాతో షహీన్ బాగ్ అంశంపై ఏమైనా మాట్లాడారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆ విషయం చర్చకు రాలేదని సమాధానమిచ్చారు.

Here's HMO Tweet

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆప్-అమిత్ షా ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీలో గెలిచేందుకు అమిత్ షా చాలా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ కేజ్రీవాల్ విజయాన్ని ఆపలేకపోయారు.

Here's Delhi CM Tweet

గత ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా గ్రౌండ్ లో ఢిల్లీ ప్రజల మధ్య సీఎంగా మూడోసారి కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో ఢిల్లీ ప్రజల ఆశిస్సులతోపాటుగా ప్రధాని మోడీ ఆశిస్సులు కూడా కావాలని కేజ్రీవాల్ కోరిన విషయం తెలిసిందే.

దేశంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ ముఖ్యమంత్రులు వీరే

తన ప్రమాణస్వీకారానికి దేశంలోని ఏ ఇతర రాజకీయనాయకుడిని ఆహ్వానించని కేజ్రీవాల్ ప్రధాని మోదీని మాత్రమే ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు వారణాశి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. ఈ ప్రమాణ స్వీకారంలో సామాన్యులే అతిధులు అయ్యారు.

మూడో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం 

గత కేబినెట్ లో పనిచేసిన ఆరుగురు మంత్రులే మరోసారి కేజ్రీవాల్ తో కలిసి మంత్రులుగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కేబినెట్ లో కొత్తవాళ్లకు చోటు లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.