Centre Bans 156 Cocktail Drugs: 156 ఫిక్స్‌ డ్‌ డోస్‌ మందులపై కేంద్రం నిషేధం.. కారణం ఏమిటంటే??

జనబాహుళ్యంలో సరఫరా అవుతున్న 156 ఫిక్స్‌ డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) మందులపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది.

Representational Picture. (Photo credits: Pixabay)

Newdelhi, Aug 23: జనబాహుళ్యంలో సరఫరా అవుతున్న 156 ఫిక్స్‌ డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) (FDC Drugs) మందులపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది. వీటి వల్ల హాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎఫ్‌డీసీ మందులపై బ్యాన్ విధించినట్టు వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కేంద్రం తాజాగా జారీ చేసింది. జ్వరం, జలుబు, అలెర్జీలు, నొప్పుల కోసం ఉపయోగించే యాంటీబ్యాక్టీరియల్‌ మందులు కూడా నిషేధిత  జాబితాలో ఉన్నాయి.

ప్రేమ వ్యవహారం..ఫ్రెండ్‌ అని చూడకుండా చంపేసిన స్నేహితులు, బాలాపూర్‌లో దారుణం, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిబాధ వర్ణనాతీతం

ఏమిటీ ఎఫ్‌డీసీ మందులు?

రెండు లేదా మూడు క్రియాశీలక ఔషధ పదార్థాలు నిర్దిష్ట నిష్పత్తిలో కలగలిపిన మిశ్రమ మందులను ఎఫ్‌డీసీ మందులు అంటారు. వీటిని కాక్‌ టెయిల్‌ డ్రగ్స్‌ (Cocktail Drugs) అని కూడా పిలుస్తారు.

మేనకోడలిని పెళ్లి చేసుకున్న మామ, ప్రేమలో పడటం తప్పుకాదని సమర్థించిన యువతి, ప్రభుత్వం తమను వదిలివేయాలని ఆవేదన, వీడియో ఇదిగో..