Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ కి ప్రమాదం.. హైదరాబాద్‌ లో ఘటన

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Bandaru Dattatreya (Credits: FB)

Newdelhi, Oct 21: హర్యానా (Haryana) గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) కాన్వాయ్‌ కు ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిషన్‌ గూడ ట్రంపెట్ బ్రిడ్జి సమీపంలోకి వచ్చిన సమయంలో మార్గమధ్యంలో హఠాత్తుగా ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్‌ లోని వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి కాన్వాయ్ లోని మూడు కార్లు ఢీకొన్నాయి.

హైదరాబాద్ బాచుపల్లిలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ లో విడిచిపెట్టి పేరెంట్స్ ఇలా వెళ్లారో.. లేదో.. అంతలోనే ఘోరం..!

దత్తన్న సేఫ్

ఈ ప్రమాద ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దత్తాత్రేయకు ఏమీ కాలేదు. వెంటనే అప్రమత్తమైన మిగతా  సిబ్బంది దత్తాత్రేయ కారు సురక్షితంగా ముందుకు పోయేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఘాతుకం.. సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్‌ పై కాల్పులు.. ముష్కరుల దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృత్యువాత