COVID-19 Outbreak Fears: బయటి దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేయండి.. ఆరోగ్య శాఖ కరోనా తాజా మార్గదర్శకాలు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 24 నుంచి ఎయిర్‌పోర్టుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా పరీక్షలు చేయాలని విమానయాన శాఖకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
Newdelhi, Dec 23: పలు దేశాల్లో కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 24 నుంచి ఎయిర్‌పోర్టుల్లో (Airports) ర్యాండమ్‌గా రెండు శాతం మందికి (2% Members) కరోనా పరీక్షలు (Corona Tests) చేయాలని విమానయాన శాఖకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రయాణికులు నమూనాలను ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పింది. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని సూచించింది. ప్రయాణికుడి వివరాలను ‘ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రాం’కు తెలియజేయాలని చెప్పింది.