IPL Auction 2025 Live

Modi Acupressure Roller: ఆ పరికరం గుట్టు విప్పిన ప్రధాని మోడీ, దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌, వ్యాయామానికి బాగా ఉపయోగపడుతుంది, నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిందన్న నమో

బీచ్‌లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

I was carrying acupressure roller during plogging at Chennai beach, reveals Modi (Photo_Twitter)

New Delhi, October 13: మహాబలిపురం బీచ్‌లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్‌లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో ప్రధాని మోదీ తన చేతిలో టార్చ్‌ వంటి పరికరాన్ని పట్టుకున్నారు. అది టార్చ్‌లైట్‌ అని కొందరు, స్లిమ్ గా ఉన్న డంబెల్‌ అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. దీని గురించి ప్రధాని మోడీకి ప్రశ్నలు వెల్లువలా వచ్చి పడుతుండడంతో ట్విటర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు.  సాగరతీరంలో మోడీ స్వచ్ఛభారత్

మామల్లాపురంలోని బీచ్ లో నేను చెత్త తీస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న వస్తువు గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌. దాన్ని తరచుగా నేను వాడుతుంటాను. నాకది ఎంతో మేలు చేసింది అంటూ మోడీ ట్వీట్ లో తెలిపారు.

మోడీ ట్వీట్

కాగా ఆక్యుప్రెజర్‌ రోలర్‌ అనేది చేతిలో ఇమిడిపోయే ఒక రకమైన వ్యాయామ పరికరం. రిఫ్లెక్సాలజీ టెక్నాలనీ ఆధారంగా ఆక్యుపెజర్ రోలర్ పని చేస్తుంది. ఉదయాన్నే దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అరచేతిలో, అరికాళ్లలో, తల భాగంలో రిఫ్లెక్స్ పాయింట్లు ఉంటాయి.  మరోసారి పంచె కట్టులో అదరగొట్టిన మోడీ

ఇవి శరీరంలోని వివిధ అవయవాలతో అనుసంధానమై ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఆక్యుప్రెజర్ రోలర్‌తో సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆక్యుప్రెజర్ రోలర్‌ను నరాలను ఉత్తేజితం చేయడానికి, రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగిస్తారు. దీన్ని పట్టుకొని తిప్పడం వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో ఉన్న వేలాది నరాలు ఉత్తేజితం అవుతాయి.

మోడీ స్వచ్ఛభారత్

దీని వల్ల శరీరానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఒత్తిడి, టెన్షన్లను తగ్గించుకోవడానికి.. శరీరం, మనస్సు రిలాక్స్‌ అవ్వడానికి ఇదెంతో ఉపకరిస్తుంది. అత్యుత్సాహం వంటి ప్రతికూల ఉద్వేగాలను నియంత్రిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. జీర్ణసంబంధితన వ్యాధులను, తలనొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలోని ఆయా ప్రాంతాల్లో ఈ పరికరం‌తో మసాజ్ చేయడం వల్ల అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు.

ఇవి కూడా చదవండి 

ఆర్టికల్ 370ని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలరా

ప్రధాని మోడీ చేతుల మీదుగా కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవం