PM Narendra Modi cleans Tamil Nadu beach ahead of talks with Xi Jinping (Photo-Twitter)

Mamallapuram,October 12:  మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి 2014లో గాంధీ జయంతి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి పరిరక్ష అనే నినాదంతో ఆనాటి నుంచి దేశ వ్యాప్తంగా అందరూ స్వచ్ఛభారత్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రధాని మోడీ కూడా అనేక సార్లు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు. సెలబ్రిటీలు సైతం మోడీ పిలుపుకు స్పందించి స్వచ్ఛభారత్ కోసం తమ వంతు సహాయాన్ని అందించారు. ఇప్పుడు భారత ప్రధాని మళ్లీ మరోసారి తాన స్వయంగా స్వచ్ఛభారత్ చేపట్టారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న మోడీ అక్కడ స్థానిక బీచ్ లో ఉన్న చెత్తను క్లీన్ చేస్తూ మరోసారి స్వచ్ఛభారత్ చేపట్టారు. అక్కడి చెత్తను తొలగించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దాదాపు అరగంట సేపే మోడీ అక్కడ ఉన్న చెత్తనంతా శుభ్రం చేశారు.

మోడీ స్వచ్ఛభారత్

మామల్లపురం బీచ్ కు జాగింగ్ కు వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా , శుభ్రంగా ఉంచుదాం, మనమంతా ఫిట్ గా , ఆరోగ్యంగా ఉందామంటూ ట్వీట్లో మోడీ పేర్కొన్నారు.

బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ట్రాక్ ప్యాంటులో ఎంతో ఉల్లాసంగా..

కాగా మార్నింగ్ వాక్ కు వెళ్లిన మోడీ బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ట్రాక్ ప్యాంటులో ఎంతో ఉల్లాసంగా జాగింగ్ చేస్తూ కనిపించారు. సాగరతీరంలో మోడీ అంటూ ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.