Indian Soldiers Diwali Celebrations: బార్డర్లో భారత సైనికుల దివాళీ వేడుకలు, దీపాల వెలుగులతో వెలుగులు విరజిమ్మిన ఇండియా బార్డర్, శుభాకాంక్షలు తెలిపిన చైనా ఆర్మీ, ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన మోడీ

ఇండియన్ ఆర్మీ దివాళీ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా సరిహద్దుల్లోని భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోనున్నారు.

Indian Soilders celebrate Diwali in Poonch sector (Photo-Twitter)

New delhi,October 27: .2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఆ ఏడాది దీపావళిని సియాచిన్‌ఇండియా బార్డర్ దీపాల వెలుగులతో విరజిమ్మింది. ఇండియన్ ఆర్మీ దివాళీ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా సరిహద్దుల్లోని భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోనున్నారు. కాగా రెండ్రోజుల క్రితమే ప్రధాని వీర జవాన్లందరికీ దీపావళి శుక్షాకాంక్షలు తెలిపారు వద్ద ఆర్మీ జవాన్లతో జరుపుకొన్నారు. ఆ తర్వాత ఏడాది పంజాబ్ సరిహద్దుల్లో పర్యటించి జవాన్లతో కలిసి వేడుకలో పాల్గొన్నారు.

2016లో హిమాచల్ ప్రదేశ్ వెళ్లి ఇండో-టిబిటెన్ సరిహద్దు పోలీసులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. నాలుగో దీపావళిని 2017లో జమ్మూకశ్మీర్‌లోని గురెజ్‌ లో సరిహద్దు జవాన్లతో కలిసి చేసుకున్నారు.

భారత సైనికుల దివాళీ వేడుకలు

గతేడాది ఉత్తరాఖండ్‌లోని భారత్‌-చైనా సరిహద్దులో ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందితో ప్రధాని దీపావళి జరుపుకున్నారు. ప్రధాని మోడీ ఈసారి కూడా భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకులు జరుపుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు

కాగా దీపావళి సందర్భంగా బార్డర్ లో భారత ఆర్మీకి చైనా ఆర్మీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈస్ట్రన్ లఢక్ లోని సరిహద్దు పోస్టు వద్ద ఇరు దేశాల ఆర్మీ అధికారులు కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.ఇందులో భాగంగా భారత ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద ఎత్తైన బ్యానర్ ను ప్రదర్శించారు చైనా మిలటరీ అధికారులు.

చైనా మిలటరీ అధికారుల దివాళీ విషెస్

ఇరు దేశాల మధ్య మరింత సామరస్య వాతావరణం ఏర్పడాలని పలువురు కోరారు. ఈ విషయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులో స్నేహపూర్వకంగా కలిసిన మీటింగ్ ఇరు దేశాలకు కలిసివచ్చిందని రెండు దేశాలు కలిసి మరింత అభివృద్ధి చెందాలని విష్ చేశారు.