Special Train Trips: ఎండకాలం ప్రత్యేక రైళ్లు.. ఏప్రిల్, మేలో 1079 ట్రిప్పులు: ఎస్సీఆర్
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad, Apr 20: ఎండకాలం (Summer) దృష్ట్యా ఏప్రిల్ (April), మేలో (May) కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోనూ దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా 9,111 ట్రిప్పు లు నడుపుతున్నట్టు పేర్కొన్నారు.