AP Government Holidays 2022: ఏపీలో వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ విడుదల, మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు, మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా తెలియజేస్తామని ప్రకటన
ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది (2022)కి సంబంధించి ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
సాధారణ సెలవులు: జనవరి 14-భోగి, జనవరి 15-సంక్రాంతి, జనవరి 26-రిపబ్లిక్ డే, మార్చి 1-మహాశివరాత్రి, మార్చి 18-హోలీ, ఏప్రిల్ 2-ఉగాది, ఏప్రిల్ 5-బాబూ జగ్జీవన్‌రాం జయంతి, ఏప్రిల్ 14-అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15-గుడ్‌ఫ్రైడే, మే 3-రంజాన్, ఆగస్టు 9-మొహర్రం, ఆగస్టు 15- ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 19-కృష్ణాష్టమి, ఆగస్టు 31-వినాయకచవితి, అక్టోబర్ 3-దుర్గాష్టమి, అక్టోబర్ 5-విజయదశమి, అక్టోబర్ 24-దీపావళి
ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు: జనవరి 16-కనుమ, ఏప్రిల్ 10-శ్రీరామనవమి, జూలై 10- బక్రీద్, అక్టోబర్ 2-గాంధీ జయంతి, అక్టోబర్ 9-మిలాద్ ఉన్ నబీ, డిసెంబర్ 25-క్రిస్మస్