APPSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ (APPSC Chairman Gautam Sawang) మంగళవారం సాయంత్రం సెలక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును (APPSC 2018 Group 1) విడుదల చేశారు.

Former DGP Gautam Sawang Appointed as APPSC Chairman (photo-Twitter)

Amaraavti, July 5: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలను ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ (APPSC Chairman Gautam Sawang) మంగళవారం సాయంత్రం సెలక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును (APPSC 2018 Group 1) విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్‌ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్ వన్ పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

జగనన్న విద్యాకానుక కిట్స్ వచ్చేశాయి, రూ.931.02 కోట్లతో 47,40,421 మంది విద్యార్థులకు ఈ ఏడాది కిట్లును ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కింది. వైఎస్సార్‌ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్‌, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్‌ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. గ్రూప్‌-1 2018 నోటిఫికేషన్‌లో 167 పోస్టులకుగానూ.. 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన. వచ్చే నెలలోనే గ్రూప్‌-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు



సంబంధిత వార్తలు

Smuggler Arrested in Pushpa 2 Theatre: పుష్ప -2 సినిమా చూస్తూ అడ్డంగా బుక్క‌యిన‌ మోస్ట్ వాటెండ్ స్మ‌గ్ల‌ర్, సినీ ఫ‌క్కీలో థియేట‌ర్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif