Cyclone Hamoon: ఈ ఉదయం 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాలకు హెచ్చరిక.. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక.. రేపు బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం..

ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్‌ లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

Cyclone (Photo-ANI)

Newdelhi, Oct 24: వాయవ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ‘హమూన్’ (Cyclone Hamoon) తీవ్ర తుపానుగా మారినట్టు భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్‌ లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Mexico Horror: పోలీసు కాన్వాయ్‌ పై బుల్లెట్ల వ‌ర్షం.. 13 మంది పోలీసులు సహా మొత్తం 17 మంది మృతి

Tamil Nadu Horror: బైకర్ ర్యాష్ డ్రైవింగ్.. 20 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డ స్టూడెంట్.. తమిళనాడులో ఘటన

కేంద్రీకృతమైంది అక్కడే

తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో హమూన్ తుపాను ఈశాన్యం దిశగా కదలడం ప్రారంభమైందని, 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పారాదీప్‌ కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌ లోని దిఘాకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల  దూరంలో వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది.

Bihar Horror: బీహార్ లో దారుణం.. దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట.. మూడేండ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి