Bihar Horror: బీహార్ లో దారుణం.. దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట.. మూడేండ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి
Bihar Horror (Credits: X)

Hyderabad, Oct 24: ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో (Dasara Navratri) భాగంగా నిర్వ‌హించిన దుర్గా పూజా (Durga Puja) వేడుక‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న బీహార్‌ (Bihar) లోని గోపాల్‌ గంజ్ జిల్లాలో సోమ‌వారం రాత్రి చోటు చేసుకుంది. గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా పండ‌ల్ వ‌ద్ద‌కు భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో, తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో మూడేండ్ల ఓ చిన్నారి భ‌క్తుల మ‌ధ్య కింద‌ప‌డిపోయింది. ఆ చిన్నారిని కాపాడేందుకు య‌త్నించిన మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Winter Season: తెలంగాణలో మొదలైన చలి పంజా.. త‌గ్గుముఖం ప‌ట్టిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆదిలాబాద్‌ లో 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ నమోదు

దవాఖానకు..

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ముగ్గురిని చికిత్స నిమిత్తం స‌ద‌ర్ హాస్పిట‌ల్‌ కు త‌ర‌లిస్తుండ‌గా, దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

World Cup, PAK vs AFG: ఆఫ్గనిస్తాన్ చేతిలో పాకిస్థాన్ దారుణ పరాజయం, పసికూన కాదు కసికూనగా నిలిచిన ఆఫ్గన్ టీం..