Winter (Photo Credits: PTI)

Hyderabad, Oct 24: తెలంగాణలో (Telangana) గ‌జ‌గ‌జ మొద‌లైంది. చ‌లి వ‌ణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు (People) ఉక్క‌పోత‌తో అల్లాడిపోయారు. నైరుతి రుతుప‌వ‌నాలు తిరుగుముఖం ప‌ట్ట‌డంతో తెలంగాణ వైపు శీత‌ల గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్ర‌త‌లు (Temperatures) సాధార‌ణం క‌న్నా దిగువ‌కు చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో తెల్ల‌వారుజామున పొగ‌మంచు క‌మ్మేస్తోంది. హ‌నుమ‌కొండ‌లో సాధార‌ణం క‌న్నా 2.7 డిగ్రీలు త‌గ్గి, క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త 19.5 డిగ్రీలు న‌మోదైంది. ఆదిలాబాద్‌లో 1.8 డిగ్రీలు త‌గ్గి 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

World Cup, PAK vs AFG: ఆఫ్గనిస్తాన్ చేతిలో పాకిస్థాన్ దారుణ పరాజయం, పసికూన కాదు కసికూనగా నిలిచిన ఆఫ్గన్ టీం..

మిగతా ప్రాంతాల్లో ఇలా..

రామ‌గుండం, మెద‌క్‌, హ‌నుమ‌కొండ‌లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గాయి. ఖ‌మ్మంలో మాత్రం సాధార‌ణం క‌న్నా 3.3 డిగ్రీలు అధికంగా, గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త 35.2 డిగ్రీలు న‌మోదైంది. హైద‌రాబాద్, భ‌ద్రాచ‌లం, ఆదిలాబాద్‌లోనూ సాధార‌ణం క‌న్నా కొంచెం ఎక్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి