Mexico Horror: పోలీసు కాన్వాయ్‌ పై బుల్లెట్ల వ‌ర్షం.. 13 మంది పోలీసులు సహా మొత్తం 17 మంది మృతి
Alabama Shooting

Hyderabad, Oct 24: మెక్సికోలో (Mexico) సోమ‌వారం దారుణం జ‌రిగింది. పోలీసు (Police) కాన్వాయ్‌ పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు తుపాకుల‌తో విరుచుకుప‌డ్డారు. పోలీసుల‌పై బుల్లెట్ల వ‌ర్షం (Bullet Attack) కురిపించారు. ఈ కాల్పుల్లో 13 మంది పోలీసులు సహా మొత్తం 17 మంది  దుర్మ‌ర‌ణం చెందారు. ఈ కాల్పుల ఘ‌ట‌న మెక్సికోలోని గురెరో రాష్ట్రంలోని కోయుక డి బెనిటెజ్ న‌గ‌రంలో చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు ధృవీక‌రించారు.

Tamil Nadu Horror: బైకర్ ర్యాష్ డ్రైవింగ్.. 20 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డ స్టూడెంట్.. తమిళనాడులో ఘటన

టార్గెట్ అతనే..

జాతీయ భ‌ద్ర‌తా విభాగానికి చెందిన ఓ సీనియ‌ర్ అధికారి ప్ర‌యాణిస్తోన్న కాన్వాయ్‌ ను ల‌క్ష్యంగా చేసుకుని దుండ‌గుల‌కు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కాల్పుల్లో సీనియ‌ర్ అధికారి మృతి చెందాడా..? లేదా..? అనే విష‌యంపై పోలీసులు ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

Bihar Horror: బీహార్ లో దారుణం.. దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట.. మూడేండ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి