Cyclone Jawad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, మూడు రోజుల పాటు 95 రైళ్లు రద్దు, జవాద్ తుపాను నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తూర్పు కోస్తా రైల్వే

జవాద్ ఎఫెక్ట్ (Cyclone Jawad) కారణంగా తూర్పు కోస్తా రైల్వే గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (East Coast Railway) ప్రకటించింది.

RailTel to continue free WiFi service at railway stations after Google will stop Project Station(Photo-ANI)

ఉత్తరాంధ్రపై జవాద్ తుపాను విరుచుకుపడుుతన్న నేపథ్యంలో రైల్వే శాఖ అలర్ట్ అయింది. జవాద్ ఎఫెక్ట్ (Cyclone Jawad) కారణంగా తూర్పు కోస్తా రైల్వే గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (East Coast Railway) ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 95 రైళ్లను రద్దు చేసింది.గురువారం రద్దు (East Coast Railway Cancels 95 Trains) చేసిన రైళ్లు విషయానికి వస్తే.. సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్‌, త్రివేండ్రం శాలీమార్‌, బెంగుళూరు కంటోన్మెంట్‌- గౌహతి, అహ్మదాబాద్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌, కన్యాకుమారి- దిబ్రుఘర్‌ ఉన్నాయి.

శుక్రవారం రద్దు చేసిన రైళ్ల విషయానికి వస్తే.. పూరి- గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్ పలకనామ ఎక్స్‌ప్రెస్‌, పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్ రథ్, హౌరా-యశ్వంత్ పూర్-దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్, పురీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రాగాచ్చి-చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్ ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా-విశాఖ ఉన్నాయి

భయం గుప్పిట్లో ఉత్తరాంధ్ర, వణికిస్తున్న జవాద్ తుపాన్, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

వీటితో పాటు ధన్ బాద్-అలిప్పీ, టాటా-యశ్వంత్ పూర్, పూరీ-అహ్మదాబాద్, భువనేశ్వర్-జగదల్పూర్, చెన్నై సెంట్రల్‌-హౌరా, హైదరాబాద్-హౌరా, చెన్నై-భువనేశ్వర్, 1226 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో, సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా, తిరుపతి-పూరీ, యశ్వంత్ పూర్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-హౌరా, వాస్కో-హౌరా, తిరుచురాపల్లి-హౌరా, బెంగళూర్-భువనేశ్వర్, ముంబై-భువనేశ్వర్, విశాఖ-కొర్బా, విశాఖ-రాయగఢ్, గుంటూరు-రాయగఢ్, జగడల్ పూర్-భువనేశ్వర్, జునాఘర్ రోడ్-భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం రోజు రద్దు అయిన రైళ్లు విషయానికి వస్తే.. భువనేశ్వర్-ప్రశాంతి నిలయం, హాతియా-బెంగుళూరు, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ – నిజాముద్దీన్- సమత ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండోల్ రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు.