Cyclone Kyarr In South India: సౌత్ ఇండియాకు క్యార్ తుఫాన్ ముప్పు, రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు, సూపర్‌ సైక్లోనిక్‌ తుఫాను మారుతున్న క్యార్, జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ

రాబోయే 24 గంటల్లో కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

cyclone-kyarr-might-turn-extremely-severe-super-cyclone as heavy rain pounds coast (Photo-Twitter)

Bengaluru, October 28: అరేబియన్‌ సముద్రంలో ఏర్పడిన 'క్యార్‌' తుఫాను ప్రభావంతో సౌత్ ఇండియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముంబై పశ్చిమానికి నైరుతి దిశలో 540 కిలోమీటర్ల​ దూరంలో ఏర్పడిన 'క్యార్‌' తుఫాను క్రమంగా బలపడుతూ 'సూపర్‌ సైక్లోనిక్‌ తుఫానుగా' రూపాంతరం చెందుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా సౌత్ ఇండియాలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసి అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. క్యార్‌ తుఫాను ప్రభావంతో గోవా, కర్నాటక ప్రాంతాంల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించామని, శనివారం నుంచే ఈ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంతంలో జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో 'కైర్‌' తుఫాను ఒమన్‌ తీరానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు వారు వెల్లడించారు.

అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రమైన తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించడంతో తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి ఒమన్ నుంచి భారతదేశం దిశగా పయనిస్తోంది. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్, కర్ణాటకలోని తీర, ఉత్తర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్టోబర్ 29వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు .