Delay in Property Sale TDS: గడువులోగా టీడీఎస్ సమర్పించలేదా? ఐదు రెట్లు ఫైన్ కట్టేందుకు రెడీ అవ్వండి, అసలు టీడీఎస్ డిడక్షన్ క్లయిమ్ ఎప్పుడు చేయాలో తెలుసా?
పిల్లల పెండ్లిండ్లు.. ఆరోగ్య సమస్యలు.. ఇతర అంశాల వల్ల ఆస్తులు అమ్మాల్సి రావచ్చు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు (Income Tax returns) చేయడంలోగానీ, డిడక్షన్ క్లయిమ్ కోసం టీడీఎస్ (TDS ) సర్టిఫికెట్ గడువు లోపు సమర్పించడంలో ఆలస్యమైనా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
New Delhi Feb 04: కుటుంబ అవసరాలు.. పిల్లల పెండ్లిండ్లు.. ఆరోగ్య సమస్యలు.. ఇతర అంశాల వల్ల ఆస్తులు అమ్మాల్సి రావచ్చు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు (Income Tax returns) చేయడంలోగానీ, డిడక్షన్ క్లయిమ్ కోసం టీడీఎస్ (TDSTDS deductor ) సర్టిఫికెట్ గడువు లోపు సమర్పించడంలో ఆలస్యమైనా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఫైన్ ఐదు రెట్లు పెరిగింది. సకాలంలో టీడీఎస్ సమర్పిస్తే విక్రయించిన ఆస్తి విలువ లేదా.. స్టాంప్ డ్యూటీలో(Stamp Duty) ఒక శాతం టీడీఎస్ డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. ఇప్పటి వరకు టీడీఎస్ సర్టిఫికెట్‌ను (TDS certificate) గడువు దాటాక సమర్పిస్తే రోజుకు రూ.100 ఫైన్ చెల్లించే వారు. కానీ ఇక నుంచి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్ సమర్పించడానికి ఐటీ శాఖ పెట్టిన గడువు 15 రోజులు మాత్రమే.
ఈ కింది పరిస్థితుల్లో ప్రతి పన్ను చెల్లింపుదారు టీడీఎస్ డిడక్షన్ క్లయిమ్ (TDS) చేయొచ్చు.
* ఇంటిపై నెలవారీ అద్దె (House Rent) రూ.50 వేలు దాటినా..
* విక్రయించిన స్థిరాస్థి విలువ రూ.50 లక్షలు దాటినా..
* ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కాంట్రాక్టర్‌కు, ప్రొఫెషనల్స్‌కు మొత్తం చెల్లింపులు రూ.50 లక్షలు దాటినా..
* ఏ వ్యక్తైనా ఇల్లు కొనుగోలు చేసినా చలాన్ కం స్టేట్‌మెంట్ (challan-cum-statement) లో మొత్తం ఆస్తి విలువలో ఒకశాతం టీడీఎస్ డిడక్షన్ కోరొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 26క్యూబీ ఫామ్ ప్రకారం ప్రభుత్వానికి సదరు మొత్తం సొమ్ము డిపాజిట్ చేయాలి. టీడీఎస్ మొత్తం డిపాజిట్ చేసిన 15 రోజుల్లో టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్ 16బీ) సమర్పించాలి.
* టీడీఎస్ డిపాజిట్ చేసిన 15 రోజుల్లోపు సర్టిఫికెట్ సమర్పించకపోతే.. ఆ తర్వాత సబ్మిట్ చేసేవరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి రోజూ రూ.500 ఫైన్ విధించాలి.
* ఏ వ్యక్తి అయినా ఇంటద్దె నెలకు రూ.50 వేలు దాటినా ఏడాదిలో ఒకసారి టీడీఎస్ కింద డిడక్షన్ క్లయిమ్ చేయాల్సి ఉంటుంది.
* భూమి విక్రయించిన యజమానికి టీడీఎస్ (ఫామ్ 16సీ) సర్టిఫికెట్‌ను 15 రోజుల్లో సమర్పించాలి. లేని పక్షంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రతిరోజూ రూ.500 ఫైన్ చెల్లించాలి. ఆదాయం పన్ను చట్టంలోని 272 ఏ సెక్షన్ ప్రకారం గడువులోపు టీడీఎస్ సర్టిఫికెట్ (TDS certificate) సమర్పించని వారిపై ఫైన్ ( penalty) పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.