EPFO Wage Ceiling Changes: వేతన జీవులకు శుభవార్త.. వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్‌వో రెడీ.. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే యోచన.. 75 లక్షల మందికి లబ్ధి.. రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము

పెన్షన్ పథకానికి సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(సీలింగ్)ని పెంచాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది.

EPFO (Credits: Facebook)

Hyderabad, November 25: పెరుగుతున్న ధరలతో సతమతమవుతూ, భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీరేదెలా అంటూ ఆందోళన పడుతున్న వేతన జీవులకు (Employees) ఇది నిజంగా శుభవార్తే (Good News). పెన్షన్ పథకానికి సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(సీలింగ్) (Ceiling)ని పెంచాలని ఈపీఎఫ్‌వో (EPFO) నిర్ణయించినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది. అదే జరిగితే రిటైర్మెంట్ (Retirement) తర్వాత ఉద్యోగుల చేతికి అందే మొత్తం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం రూ. 15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. అప్పుడు ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా కూడా పెరుగుతుంది. ఫలితంగా  ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ఇద్దరి వాటాలకు వడ్డీ (Interest) వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

డిసెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్

ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని కేంద్రం చివరిసారి 2014లో సవరించింది. అప్పట్లో రూ. 6,500గా ఉన్న పరిమితిని రూ. 15 వేలకు పెంచారు. అయితే, 20 మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. 8 సంవత్సరాల తర్వాత పరిమితిని పెంచాలని భావిస్తున్న కేంద్రం ఇందుకోసం ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. అలాగే, తాజా నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది పీఎఫ్‌వో పరిధిలోకి వస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ మొత్తం మందికి ప్రయోజనం చేకూరనున్నది.

చైనాలో కొత్త వేరియంట్ BQ.1 కల్లోలం, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 31,444 కోవిడ్ కేసులు నమోదు, పలు ప్రావిన్స్‌లలో లాక్‌డౌన్ అమల్లోకి..



సంబంధిత వార్తలు