Goodnews for US Visa: యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. 2.5 లక్షల నాన్‌ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌ మెంట్లు ఓపెన్

అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌ న్యూస్ చెప్పింది.

US Embassy in India Issued Record Student Visas This Summer (File Image)

Hyderabad, Nov 3: అగ్రరాజ్యం అమెరికా (USA) వీసా ఇంటర్వ్యూ (Visa Interview) కోసం సాధారణంగా చాలా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు (Indians) అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌ న్యూస్ చెప్పింది. వారాంతంలో 2.5 లక్షల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌ మెంట్లను ఓపెన్ చేసినట్టు భారత్‌ లోని అమెరికా రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. తమ కాన్సులర్ బృందానికి ఇది బిజీ వారమని తెలిపింది. https://www.ustraveldocs.com/in/en పై అపాయింట్‌ మెంట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఫలితంగా నాన్‌ ఇమ్మిగ్రెంట్ వీసాలైన బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) ఇంటర్వ్యూ కోసం వేచి చూసే సమయం భారీగా తగ్గింది.

Telangana Elections: సీఎం కేసీఆర్‌ పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ.. కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు.. కామారెడ్డిలో ఆసక్తికర రాజకీయం

ఏ నగరాల్లో ఎంత తగ్గిందంటే?

IND vs SL World Cup 2023: నిప్పులు చెరిగిన మొహమ్మద్ షమీ, ఘోర పరాజయం పాలైన శ్రీలంక, సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా

హైదరాబాద్ లో ఇలా..

అన్ని నగరాలకు విరుద్ధంగా హైదరాబాద్‌ లో కొన్ని రోజులు అదనంగా పెరిగాయి. గతవారం వెయిటింగ్ సమయంలో 506 రోజులు ఉండగా ఇప్పుడది 511 రోజులకు పెరగడం గమనార్హం. ఇదిలావుండగా ఈ ఏడాది అమెరికా, భారతీయులకు సంబంధించిన 10 లక్షలకు పైగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. కరోనా ముందు కంటే ఇది 20 శాతం ఎక్కువని ఎంబసీ అధికారులు తెలిపారు.