New IMPS Money Transfer Rule: ఫిబ్రవరి 1 నుంచి సామాన్యులకు ఊరట, లబ్ధిదారుని వివరాలతో పని లేకుండా రూ. 5 లక్షల వరకు నగదు బదిలీ, IMPS కొత్త రూల్ గురించి తెలుసుకోండి
ఇప్పుడు మీరు లబ్ధిదారుని పేరును జోడించకుండానే బ్యాంకు ఖాతా నుండి రూ. 5 లక్షల వరకు ఇతరులకు నగదు బదిలీ చేయవచ్చు. గతేడాది అక్టోబర్ 31న ఎన్‌పీసీఐ దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది.
Send More Money through IMPS from February 1: సామాన్యులకు ఊరటనిచ్చేలా ఆర్‌బీఐ మార్పులు చేసింది. ఇప్పుడు మీరు లబ్ధిదారుని పేరును జోడించకుండానే బ్యాంకు ఖాతా నుండి రూ. 5 లక్షల వరకు ఇతరులకు నగదు బదిలీ చేయవచ్చు. గతేడాది అక్టోబర్ 31న ఎన్‌పీసీఐ దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది. ఫిబ్రవరి నెలలో కేవలం 11 రోజులే పనిచేయనున్న బ్యాంకులు, సెలవుల ఫుల్ లిస్ట్ ఇదే!
దీని ప్రకారం దేశంలో ఫిబ్రవరి 1, 2024 నుంచి తక్షణ చెల్లింపు సేవల (IMPS) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్, వారి బ్యాంక్ పేరును ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయవచ్చు.ఈ రూల్ పేమెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖాతా నంబర్లు లేదా IFSC కోడ్ వంటి లబ్ధిదారుల వివరాలు సమర్పించకుండానే మీ ఖాతా నుండి రూ.5 లక్షల వరకు బదిలీ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త నిబంధనను ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టింది. ఈ రియల్ టైమ్ పేమెంట్ సర్వీస్ ప్రతి రోజూ 24 గంటలు పని చేస్తుంది.
ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే, IMPS కొత్త రూల్ గురించి తప్పనిసరిగా తెలుసుకోండి మరి
సాధారణంగా IMPS ద్వారా రెండు రకాల చెల్లింపులు జరుగుతాయి. మొదటిది వ్యక్తి నుంచి ఖాతాకు. ఇందులో మీరు రిసీవర్ ఖాతా నంబర్, బ్యాంక్ పేరు మరియు IFSC కోడ్ ఇవ్వాలి. రెండవది వ్యక్తి నుంచి వ్యక్తి. దీనిలో మీరు రిసీవర్ యొక్క మొబైల్ నంబర్, మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ (MMID)ని అందించాలి. MMID అనేది బ్యాంక్ జారీ చేసిన 7 అంకెల సంఖ్య, ఇది మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ కోసం అందించబడుతుంది. కొత్త ఫీచర్‌లో మీరు MMID స్థానంలో ఫోన్ నంబర్, బ్యాంక్ పేరును అందించాలి. IMPS ద్వారా మీరు లబ్ధిదారుని జోడించకుండానే రూ. 5 లక్షల వరకు మొత్తాన్ని పంపవచ్చు.