Mumbai, JAN 28: ఇటీవల కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా (Bank Account) ఉంది. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు (Online) లావాదేవీలు చాలా వరుకు చేసుకోవచ్చు. అయినప్పటికీ కొన్నిసార్లు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎంతో శ్రమపడి బ్యాంకు వెళ్లిన తరువాత హాలీడే (Bank Holidays) కావడంతో బ్యాంకులు మూసి ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. చేయాల్సిన పని వాయిదా పడుతుంది. మరోసారి బ్యాంకు కు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఏ ఏ రోజున బ్యాంకులకు హాలీడేలు (Bank Holidays in February) ఉంటాయో ముందుగానే తెలుసుకుంటే.. అందుకు తగ్గట్లుగా మన పనులు పూర్తి చేసుకోవచ్చు. దీని వల్ల శ్రమతో పాటు సమయం ఆదా అవుతుంది. మరో మూడు రోజుల్లో జనవరి నెల పూర్తి అవుతుంది. ఫిబ్రవరి నెల మొదలు కానుంది. మరీ ఫిబ్రవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి.? ఎన్ని రోజులు పనిచేస్తాయో అన్న సంగతి చూద్దాం.
ఫిబ్రవరి నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. దాదాపు 11 రోజులు బ్యాంకులకు హాలీడేలు ఉన్నాయి. రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు అన్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవు రోజులివే!
ఫిబ్రవరి 4 – ఆదివారం
ఫిబ్రవరి 10 – రెండవ శనివారం
ఫిబ్రవరి 11 – ఆదివారం
ఫిబ్రవరి 14 – వసంత పంచమి (త్రిపుర, ఒడిశా, భువనేశ్వర్, పశ్చిమబెంగాల్‌లో )
ఫిబ్రవరి 15 – లూ-ఎన్‌గై ని- (ఇంఫాల్‌లో)
ఫిబ్రవరి 18 – ఆదివారం
ఫిబ్రవరి 19 – ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (బేలాపూర్, ముంబై, నాగపూర్ లో)
ఫిబ్రవరి 20 – రాష్ట్ర అవతరణ దినోత్సవం (అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో)
ఫిబ్రవరి 24 – రెండో శనివారం
ఫిబ్రవరి 25 – ఆదివారం
ఫిబ్రవరి 26 – నైకూమ్- (అరుణాచల్ ప్రదేశ్)
బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్స్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం పని చేస్తాయి. డిపాజిట్ మెషిన్ల ద్వారా అకౌంట్లలో డబ్బులు వేసుకోవచ్చు.