Indian Railways: రేపటి నుంచి మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపిన రైల్వేశాఖ, విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగింపు, పూర్తి సమాచారం ఇదే..
ఈ మేరకు ట్రైన్ల జాబితాను చైన్నైలోని సదరన్ రైల్వే (Indian Railways to restore some cancelled spl trains) ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి భద్రతా నియమాలు పాటించాలని ప్రయాణికులను కోరింది.
Amaravati, June 19: కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ల జాబితాను చైన్నైలోని సదరన్ రైల్వే (Indian Railways to restore some cancelled spl trains) ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి భద్రతా నియమాలు పాటించాలని ప్రయాణికులను కోరింది. పునరుద్ధరించిన ట్రైన్లలో చెన్నై ఎగ్మోర్ – తంజావూర్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – తిరువనంతపురం, కోయంబత్తూర్ – నాగర్‌కోయిల్, పునలూర్ – మధురై ట్రైన్లు ఉన్నాయి. వాటిని ఈ నెల 20, 21 తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
మరో వైపు గోరఖ్‌పూర్ – ఎర్నాకుళం సెక్టార్‌లో సమ్మర్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. సమ్మర్ స్పెషల్ రైలు 19, 26 (శనివారం) తేదీల్లో ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి మూడో రోజు మధ్యాహ్నం 2.30గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుందని పేర్కొంది. తిరిగి 21, 28 (సోమవారం) తేదీల్లో రాత్రి 11.55 గంటలకు ఎర్నాకుళం నుంచి బయలుదేరి నాలుగో రోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుందని రైల్వేశాఖ పేర్కొంది. సిల్చార్ – కోయంబత్తూరు రూట్‌లో 22 నుంచి వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించింది.
విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యశ్వంత్‌పూర్–అహ్మదాబాద్ వారాంతపు రైళ్లు (06501/06502), యశ్వంత్‌పూర్–జయ్‌పూర్ వారాంతపు రైళ్లు (06521/06522), అజ్మీర్–బెంగళూర్ వారాంతపు రైళ్లు (06205/06206), బెంగళూర్–జోద్‌పూర్ వారాంతపు రైళ్లు (06533/06534), యశ్వంత్‌పూర్–ఢిల్లీ వారాంతపు రైళ్లు (06593/06594) యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్–అగర్తల ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్–అగర్తలా మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలు(07029) ఈ నెల 18, 25 తేదీలలో ప్రతి శుక్రవారం ఉదయం 6.10 గంటలకు అగర్తలలో బయలుదేరి, రెండో రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (07030) ఈ నెల 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం మధ్యాహ్నం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగర్తలా చేరుకుంటుంది.