Coronavirus Cases in India: దేశంలో 74 రోజులు తరువాత అత్యంత తక్కువగా కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 60,753 మందికి కోవిడ్, ప్రస్తుతం 7,60,019 యాక్టివ్‌ కేసులు, కొవిడ్‌-19 టీకా డ్రైవ్‌లో మరో మైలురాయిని అధిగమించిన భారత్
Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi, June 19: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 60,753 కొత్త కేసులు (Coronavirus Cases in India) నమోదయ్యాయి. అలాగే రికవరీ రేటు శాతం 96.16 శాతంగా ఉంది. దేశంలో 74 రోజులు తరువాత అతి తక్కువ రోజువారీ కేసుల నమోదు ఇదేనని రికవరీ శాతంగా బాగా పుంజుకుందని మంతత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా 1647 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు కోట్లకు(2,98,23,546) (Coronavirus in India) చేరువలోఉంది. అలాగే కరోనా కారణంగా ఇప్పటివరకూ మొత్తం 3,85,137 మంది కన్నుమూశారు. 7,60,019 యాక్టివ్‌ కేసులున్నాయి. 97,743 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,23,88,783 డోసులు ఇవ్వడం జరిగింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,92,07,637 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,02,009 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.కొవిడ్‌-19 టీకా డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ శుక్రవారం 154వ రోజుకు చేరగా.. 27 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 27,20,72,645 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారతీయులు, గత 12 నెలల్లో 43 శాతం మంది చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదని సర్వేలో వెల్లడి, గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల బహిష్కరణపై ఊపందుకున్న ఉద్యమం

మూడో విడుత టీకా డ్రైవ్‌లో భాగంగా 18-44 ఏజ్‌ గ్రూప్‌లో 19,43,765 మందికి మొదటి, మరో 77,989 మందికి రెండో డోసు టీకా అందజేసినట్లు పేర్కొంది. మూడో దశ డ్రైవ్‌ ప్రారంభించిన నాటి నుంచి మొత్తం 5,15,68,603 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఒకే రోజు 29,84,172 టీకా మోతాదులు వేయగా.. ఇందులో 26,24,028 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 3,60,144 మంది లబ్ధిదారులకు రెండో డోసు అందజేసినట్లు వివరించింది.