AP Weather Report: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Southwest Monsoon Withdraws (Photo-PTI/ Rep)

Amaravati, Oct 27: దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం (Low-pressure area likely to form over Bay of Bengal) ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Andhra Pradesh on alert) కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణ (Telangana ) రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కిందిస్థా యి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం, 29, 30 తేదీల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురి సే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

భారత్‌ను వీడిన నైరుతి రుతుపవనాలు,ఈశాన్య దిశకు కదిలిన గాలులు, రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, వివరాలను వెల్లడించిన ఐఎండీ

మరోవైపు, రా ష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 13.1 డిగ్రీలు రికార్డయినట్టు పేర్కొన్నది.