Mobile Data Speed: మొబైల్ డేటా వేగంలో భారత్ 105 ర్యాంక్.. 176.18 ఎంబీపీఎస్ వేగంతో ప్రపంచంలోనే ఖతార్ టాప్
ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 18.26 ఎంబీపీఎస్ గా ఉంది. కానీ, అక్టోబర్ లో ఈ సగటు వేగం 16.50 ఎంబీపీఎస్ గానే ఉంది. ఫలితంగా అక్టోబర్ లో ఉన్న 113వ ర్యాంక్ నుంచి భారత్ 105కి చేరింది.
Newdelhi, Dec 20: భారత్ లో మొబైల్ డేటా వేగం (Mobile Data Speed) అంతకంతకూ పెరుగుతున్నది. ఫలితంగా ఊక్లా స్పీడ్ టెస్ట్ (Ookla Speed Test) గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్ ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. నవంబర్ నెలలో భారత్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం (Mobile Download Speed) 18.26 ఎంబీపీఎస్ గా ఉంది. కానీ, అక్టోబర్ లో ఈ సగటు వేగం 16.50 ఎంబీపీఎస్ గానే ఉంది. ఫలితంగా అక్టోబర్ లో ఉన్న 113వ ర్యాంక్ నుంచి భారత్ 105కి చేరింది.
విజయవాడలో దారుణం.. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు గ్యాంగ్ రేప్
సగటు మొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా ఖతార్ మొదటి స్థానంలో నిలిచింది. 176.18 ఎంబీపీఎస్ వేగం అక్కడ నమోదు అయింది. ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ లో చిలీ 216.46 ఎంబీపీఎస్ వేగంతో మొదటి స్థానంలో ఉంటే, 214.58 ఎంబీపీఎస్ వేగంతో చైనా తర్వాతి స్థానంలో నిలిచింది.
మళ్లీ థియేటర్లలో పవన్ కల్యాణ్ 'ఖుషి' సందడి.. డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు!