Mobile Number Portability: ఎంఎన్‌పీ సేవలకు బ్రేక్, వారం రోజుల పాటు మూగబోనున్న సేవలు, నవంబర్ 11 నుంచి రెండు రోజుల్లోనే ప్రాసెస్ పూర్తి, ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్

మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్‌కు మార్చుకునే సదుపాయం ఇది. ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) సేవలను నిలిపివేస్తున్నట్లు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది.

Mobile users cannot submit port out requests between Nov 4-10 (ANI)

October 20: మొబైల్ పోర్టబిలిటీ.. మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్‌కు మార్చుకునే సదుపాయం ఇది. ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) సేవలను నిలిపివేస్తున్నట్లు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 11 నుంచి ఎంఎన్‌పీలో కొత్త విధానం రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓల్ట్ ప్రాసెస్‌లో ఆపరేటర్‌ ఛేంజ్‌కు కనీసం వారం రోజుల సమయం పట్టేది. అయితే తాజాగా రానున్న ప్రాసెస్‌లో ఇది కేవలం రెండు రోజులలోనే పూర్తికానుంది.

మొబైల్ నంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే వినియోగదారులు తమ ఆపరేటర్‌ను మార్చుకునేందుకు ఎంఎన్‌పీ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ఎంఎన్‌పీ విధానం ప్రకారం వినియోగదారులు పోర్టబిలిటీ ప్రక్రియ పూర్తయ్యేందుకు వారం రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది.

కాగా నూతన విధానంతో మరింత వేగంగా, సులభంగా ఎంఎన్‌పీ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది. వినియోగదారులు సర్వీస్ ఏరియాలోనే నివసిస్తూ కొత్త ఆపరేటర్‌ సేవలు అందుకోవాలంటే ఇకపై రెండు రోజులు సరిపోతుంది. సర్వీస్ ఏరియాకు వెలుపల నివసిస్తున్న వారు మాత్రం ఐదు రోజుల వరకు వేచిచూడాల్సి ఉంటుంది.