Bagless Days: బ్యాగుల మోతకు చెల్లు.. 10 రోజులు బ్యాగ్‌ లెస్‌ డేస్‌.. 6-8 తరగతులకు అమలు.. కేంద్రం మార్గదర్శకాలు

ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది.

School bags (Credit PTI)

Newdelhi, July 30: విద్యార్థులపై (Students) బ్యాగుల (Bags) మోత తగ్గించడానికి, చదువును ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. 6-8 తరగతులకు విద్యా సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్‌ లెస్‌ డేస్‌ (Bagless Days) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌సీఈఆర్‌టీ అనుబంధ సంస్థ అయిన పీఎస్‌ఎస్‌ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శకాలను ప్రకటించింది.

చనిపోయిన భర్తను.. ఓ చెట్టు లో చూసుకుంటూ ఏటా బర్త్ డే చేస్తున్న భార్య.. చెట్టుకు డ్రెస్ వేసి అందంగా అలంకరించి వేడుకలు.. ఎక్కడో కాదు మనదగ్గరే..!

బ్యాగ్ లెస్ డేస్ ఇలా..

బ్యాగులు లేని రోజుల్లో విద్యార్థులు ఖాళీగా ఉంటారని అనుకొంటే పొరపాటే. ఆ రోజుల్లో విద్యార్థులు గార్డెనింగ్, కుండల తయారీ, వంటలు, గాలిపటాల తయారీ, వాటి ఎగరవేత, పుస్తకాల ప్రదర్శన, కార్పెంటరీ, ఎలక్ట్రిక్‌ మెషీన్ రూపకల్పన ఇలా తమకిష్టమైన పనులు చేయవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఆయా రోజుల్లో స్కూల్స్ కు నిపుణులను రప్పిస్తారు.

కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది.. సహాయక చర్యలు ముమ్మరం