 
                                                                 Newdelhi, Oct 1: పని ఒత్తిడి (Work Pressure) కారణంగా సతమతమై చివరకు ప్రాణాలు కోల్పోతున్న ఉద్యోగుల ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది. బజాజ్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. దాదాపు 45 రోజులు నిద్ర పోకుండా పని చేశానని.. ఒత్తిడి కారణంగానే చనిపోతున్నట్లు సూసైడ్ లేఖలో తెలిపాడు. మృతుడిని ఝాన్సీకి చెందిన తరుణ్ సక్సేనా (42)గా గుర్తించారు.
"No Sleep For 45 Days": Loan Company Staff Dies By Suicide, Blames Work Pressure https://t.co/VbYW4LuofG pic.twitter.com/BlyIkUumDt
— NDTV (@ndtv) October 1, 2024
అసలేం జరిగింది?
తరుణ్ సక్సేనా బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్ గా పని చేస్తున్నారు. అయితే.. టార్గెట్ లు పెడుతూ తనపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. పనిని సమయానికి పూర్తి చేయకపోతే.. జీతాన్ని కుదిస్తామని బెదిరించేవారు. దీంతో 45 రోజులు నిద్ర మానేసి మరి పని చేశారు. తన సమస్య గురించి సీనియర్లకు వివరించినా.. పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడికి గురైన తరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు భార్యకు రాసిన ఐదు పేజీల సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు గల కారణాలను తరుణ్ వివరించారు. కాగా.. పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
