Vijayawada, Oct 1: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన 'జగనన్న తోడు' స్కీమ్ (Jagananna Thodu Scheme) పేరును మార్చింది. ఈ పథకానికి 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా (Chiru Vyaparulaku Vaddi Leni Runalu) పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత వైఎస్ జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారుల కోసం 'జగనన్న తోడు' పథకం కింద రూ. 10వేల ఆర్థిక సాయం అందించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా వడ్డీలేని రూ.10 వేల రుణం అందించారు.
ఏపీలో ‘జగనన్న తోడు' స్కీమ్ కు పేరు మార్పు
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది.
'జగనన్న తోడు' స్కీమ్ పేరును 'చిరువ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10వేల చొప్పున రుణాలు…
— Telangana Awaaz (@telanganaawaaz) October 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)