India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం
జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ, నవంబర్ 22: కెనడాలో నేర కార్యకలాపాలతో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వివరణ ఇచ్చింది. అటువంటి వాదనలకు ఎటువంటి ఆధారాలు మద్దతు ఇవ్వలేదని, ఈ విషయం చుట్టూ ఉన్న ఊహాగానాలను తొలగించాలని ప్రకటన నొక్కి చెప్పింది. ప్రివీ కౌన్సిల్ డిప్యూటీ క్లర్క్ మరియు కెనడియన్ ప్రధాన మంత్రికి జాతీయ భద్రత మరియు ఇంటెలిజెన్స్ సలహాదారు అయిన నథాలీ జి. డ్రౌయిన్ నుండి ఈ స్పష్టత వచ్చింది.
కాగా ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ – కెనడా దేశాల (Canada Vs India) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో భారత్‌పై కెనడా ప్రభుత్వం తన అక్కసును వెల్లగక్కుతోంది. నిత్యం భారత ప్రధాని (PM Modi), భారత అధికారులపై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది. ఈ ఉద్రిక్తతల వేళ కెనడా మీడియాలో కథనం ఒకటి బయటకు వచ్చింది. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల హస్తం ఉన్నదని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ వార్తాకథనం హాస్యాస్పదం అంటూ తోసిపుచ్చింది. కెనడా భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగంగా వాటిని కొట్టిపారేసింది. ఇటీవల, అక్టోబర్ 29, 2024న పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీపై స్టాండింగ్ కమిటీ ముందు ఒట్టావా నుంచి తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. ఈ సెషన్‌లో, కెనడాలోని ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి కెనడా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డేవిడ్ మారిసన్ వ్యాఖ్యలు చేశారు.
దౌత్యపరంగా భారత్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “మేము నిన్న కెనడియన్ హైకమిషన్ ప్రతినిధిని పిలిచాము. అక్టోబరు 29, 2024న ఒట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీపై స్టాండింగ్ కమిటీ ప్రొసీడింగ్స్‌ను ప్రస్తావిస్తూ దౌత్యపరమైన నోట్ అందజేయబడింది. భారత ప్రభుత్వం అసంబద్ధమైన, నిరాధారమైన పదాలను తీవ్రంగా నిరసిస్తున్నట్లు నోట్‌లో తెలియజేయబడిందని తెలిపింది.
భారత్ ఆగ్రహంతో తాజాగా కెనడా వెనక్కి తగ్గింది. మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేసింది. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్లను తాము ఎన్నడూ ప్రస్తావించలేదని పేర్కొంది. వార్తాపత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవమేనంటూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో భారతీయ అధికారులను నేరుగా దోషులుగా చూపే ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని ఒట్టావా స్పష్టం చేసింది. దీ