Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు.. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

AP Rains (photo-Video Grab)

Hyderabad, Aug 21: రానున్న మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వర్షాలు (Rains) పడనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో (AP) వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినప్పటికీ... గుంటూరు, కృష్ణ, బాపట్ల, ఏలూరు, అల్లురి, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

తెలంగాణలో కూడా..

తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.