Commercial LPG Gas: వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్.. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.39 మేర పెంపు.. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి..
19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39 మేర పెంచాయి.
Newdelhi, Sep 1: ఒకటో తేదీనే వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు (Commercial LPG Gas) ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ (LPG Gas) సిలిండర్ ధరలను రూ.39 మేర పెంచాయి. ఈ మేరకు ఇవాళ ధరలను సవరించాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా 14 కేజీల గృహవినియోగ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రిటైల్ ధర రూ.1,691.50కి చేరింది.
వరుసగా మూడోసారి
19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించడం వరుసగా ఇది మూడవసారి.